NIGAMA MEDIA (P) LTD
19.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

హోటల్ నుంచి తెచ్చిన ఉప్మా పార్సిల్ లో ఎలుక

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్సు స్టాండ్ సమీపంలో పేరుపొందిన ఒక ప్రముఖ హోటల్ నుంచి ఒకరు ఉప్మా పార్సిల్ తెచ్చుకోగా ఆ ఉప్మాలో ఎలుక కనిపించడంతో కొనుగోలుదారుడు ఖంగుతిన్నాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.ఒక వినియోగదారుడు బుధవారం ఆ హోటల్ లో ఉప్మా కొనుగోలు చేసాడు.ఇంటికి వెళ్లి తినడానికి పార్సిల్ ను తెరిచి చూడగా ఉప్మాలో చనిపోయిన ఎలుక కనిపించింది. దింతో కంగుతిన్న ఆ వ్యక్తి పార్సిల్ తో హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ,మాకు సంబంధంలేదని బదులిచ్చారు.మా హోటల్ లో ఇలాంటివి జరుగవు.చనిపోయిన ఎలుకకు మాకు సంబంధంలేదు అంటూ తెలుపడంతో గొడవగా మారింది.ఈ విషయమై హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థములను అందిస్తున్నామని, ఎలుక చనిపోయిన అల్పాహారం కు మాకు ఎలాంటి సంబంధంలేదని వివరించడం జరిగింది

అంత పెద్ద హోటల్లో ప్రతిరోజు కనీసం 50 కిలోల ఉప్మా వండుతారు. 50 కిలోల ఉప్మా చేయడానికి ముందుగా వేడి నీటిని ఉపయోగిస్తారు. అలాంటి మరిగే నీటిలో ఎలుక పడిందంటే చితికిపోతుంది.పార్సిల్ లో వచ్చిన ఎలుక దెబ్బతినకుండా యధావిధిగా చనిపోయి ఉంది. వినియోగదారుడి మాటలకు కూడా పొంతన లేదని పలువురు హోటల్ వ్యాపారులు చెబుతున్నారు. ఎవరో ఓర్వలేకనే ఈ పని చేసి ఉంటారని కూడా కొందరు హోటల్ వ్యాపారాలు ఆరోపిస్తున్నారు.

—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.