NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

సింగరేణిలో బీజేపీ భరోసా యాత్ర విజయవంతం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

భరోసా యాత్రలో BJP మైనార్టీ మోర్చా
తరలివచ్చిన కార్మిక వర్గం
కార్మికుల మద్దతు పొందిన భరోసా యాత్ర
BJP మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్

కోల్ బెల్ట్ న్యూస్(భూపాలపల్లి):

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆధ్వర్యంలో , కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండో రోజు విజయవంతమైనదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ తెలిపారు. ఈ సందర్బంగా సింగరేణి భరోసా యాత్రను పురస్కరించుకొని రజనీష్ జైన్ మాట్లాడుతూ

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తాడిచెర్ల నుంచి యాత్రలో పాల్గొని సింగరేణి కార్మికుల సమస్యలు, సంస్థ అభివృద్ధి, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై కార్మికుల నుంచి వివరాలు తీసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణే పార్టీ లక్ష్యమని అన్నారు.

సింగరేణి ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ భరోసా యాత్రకు మద్దతు తెలుపుతున్నారని, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో కూడా కొత్త గనుల నిర్మాణం చేపట్టి ఉపాధి అవకాశాలు పెంచడానికి మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేయనున్నామన్నారు. అదే విదంగా మూత పడిన గనుల్లో బొగ్గు నిల్వలు ఉన్న చోట గ్యాస్ ఉత్పత్తి చేయడానికి కూడా ప్రణాళికలు సిద్దమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి పరంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.