Home » Politics : కడిగిన ముత్యం …కవిత

Politics : కడిగిన ముత్యం …కవిత

పార్టీ పెట్టబోతున్న సమయంలో అందిన శుభవార్త
ఇక నిత్యం జనంలోనే
పార్టీ అభివృద్ధి కోసం ప్రణాళికలు
కవిత పార్టీ వైపు నేతల చూపు
రాజకీయంగా కవితకు కలిసొచ్చిన తీర్పు

Politics : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద శుభవార్త అందుకుంది. మద్యం కేసులో ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాల నుంచి ఆమెను విముక్తి చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన విధంగానే ఇప్పుడు కడిగిన ముత్యం.

బెయిల్ పై కవిత విడుదలైన సందర్భంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని. అనవసరంగా మంచిదాన్ని జైలు కు పంపి జగమొండిని చేసిండ్రు. ప్రజాక్షేత్రంలో గట్టిగ పని చేస్తా. కమిట్ మెంట్ తో పని చేస్తా . నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. కడిగిన ముత్యంలా వస్తాను అంటూ మాట్లాడిన మాటలు నేడు నిజమయ్యాయి.

మరో మూడు నెలల్లో కవిత పార్టీని నిర్మించబోతున్నారు. ఈ సమయంలో మద్యం కేసు కొట్టుడు పోవడంతో ఆమెకు రాజకీయంగా అదనపు బలం చేకూరింది. ఈ కేసు గురించి రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ వారు ఆమెను నిలదీసే పరిస్థితి లేదు. కుటుంబం నుంచి విడిపోయి ఆమె రాజకీయ పోరును ఎంచుకుంది. కడిగిన ముత్యంలా ఆమె జనంలో ఉంటూ పార్టీ అభివృద్ధికి ప్రణాళికలు రూపిందించుకోవడమే మిగిలింది.

ఆమె పార్టీ స్థాపించబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆమె వైపు ఎవరు కూడా మొగ్గు చూపలేదు. మద్యం కేసులో ఉండటం, ఆ కేసు ఎటు దారి తీస్తుందో అంతుబట్టకపోవడంతో మరికొందరు నేతలు వెనుకడుగు వేశారు. దాదాపుగా అన్ని పార్టీలు రాష్ట్రంలో బలంగానే కనబడుతున్న నేపథ్యంలో కవిత పార్టీ ఆ మూడింటిని తట్టుకొని నిలబడదా అనే అనుమానంతో మరికొందరు నేతలు ఉండిరి. ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూస్తున్న నేతలు మరి కొందరు ఉండగా కవితపై మోపిన మద్యం కేసు కొట్టుడు పోయింది. ఇప్పుడు అటువంటి నేతలను కవిత స్థాపించబోయే కొత్త పార్టీ ఆకర్శించబోతోంది. ఎవరెవరు ఆమె సమయం కోసం వేచిచూస్తారో వేచి చూడాల్సిందే.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *