ఒకటే రోజు పోలింగ్
రేపటినుంచే నామినేషన్
ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం
ఫిబ్రవరి 11న పోలింగ్
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
Muncipal : తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు. 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లలో ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ వేయడం, 31 న పరిశీలన, ఫిబ్రవరి 3 నామినేషన్ ఉపసంహరణ, ఫిబ్రవరి 11 న పోలింగ్, 12 రీపోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న ప్రమాణ స్వీకారం తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈ పోరులోప్రధాన పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోడానికి సన్నద్ధమవుతున్నాయి.
అధికార పార్టీ దూకుడు మీద ఉంది. రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు గ్రామపంచాయితీ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలను పునరావృతం చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ప్రజల్లో సర్వే , ఆర్థిక బలం, అంగబలం సమానంగా ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. కనీసం 90 స్థానాల్లో విజయపతాకాన్ని ఎగురవేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.
పట్టణాల్లో ఉన్న బలంతో కాషాయం నేతలు పోరుకు సిద్దంగానే ఉన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్,నిజామాబాదు, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు. అదే విధంగా ఆర్మూర్, నిర్మల్, ముథోల్, కామారెడ్డి స్థానాల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వారందరికీ మున్సిపల్ స్థానాలను దక్కించుకోవడం పెద్ద పరీక్ష. ఇద్దరు కేంద్ర మంత్రులకు కూడా పట్టనాల్లో ఉన్న బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారం కోల్పోయి కొట్టుమిట్టాడుతోన్న బిఆర్ఎస్ పూర్వ వైభవం కోసం ఆరాటపడుతోంది. అధినేత కేసీఆర్ గడప దాటే పరిస్థితి కానరావడంలేదు. బాధ్యత అంతా కూడా కేటిఆర్, హరీష్ రావు పైననే ఉంది. వారిద్దరూ ఏ మేరకు విజయాన్ని అందుకుంటారో వేచిచూడాల్సిందే. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ నడుస్తోంది. ఎన్నికల ప్రచార సమయాల్లోనే సిట్ అధికారులు మధ్యలో పిలిస్తే ప్రచారానికి ఇబ్బంది తప్పదు.
మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు కోసం తెలంగాణ జన సమితి, సీపీఐ, సిపిఎం కూడా ఆరాటపడుతున్నవి. అదే విదంగా జనసేన నేతలు కూడా పోటీకి సై అంటున్నారు. పార్టీ పేరు ఖరారు కానప్పటికీ జాగృతి బలమెంతో తెలియదు కానీ, ఆ సంస్థ నేతలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి కాలుదువ్వుతున్నారు. ఏదిఏమైనప్పటికీ కాంగ్రెస్ 90 శాతం మెజార్టీ దక్కించుకుంటేనే భవిష్యత్తుకు ఆధారం ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

by