Mavoist : మారిన మా మెజారిటీ పార్టీ వైఖరిని గమనంలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం కొరకు మా పార్టీతో శాంతి చర్చలు జరపడానికి చొరవ చూపాలని, అందుకు మేము కూడా సిద్దంగానే ఉన్నామని మావోయిస్టు పార్టీ అనుబంద సంఘం సికాస కార్యదర్శి అశోక్ మీడియా కు బుధవారం లేఖ విడుదల చేశారు. మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సోను (అభయ్ ) శాంతి ప్రతిపాదనను సికాస సమర్ధిస్తున్నదని అశోక్ తన లేఖలో స్పష్టం చేశారు.
గత రెండు సంవత్సరాలుగా మా పార్టీలో రెండు పంథాల మధ్య ఘర్షణ జరుగుతున్నది వాస్తవమే. విప్లవ పార్టీలో రెండు పంథాల మధ్య పోరాటం అభివృద్ధికరమైనది. అనేక కేంద్ర కమిటీ సమావేశాలలో పార్టీ అవలంబిస్తున్న వ్యూహం ఎత్తుగడల గురించి లోతయిన చర్చలు జరిగాయి. చర్చలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో మా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు విఫలమైనాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మా పార్టీ తీవ్రంగా నష్టపోయింది.
దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ మార్గంలో మా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఈ స్థితిలో ఆయుధాలను త్యజించి రాజ్యాంగ పరిధిలో చట్ట బద్దంగా ప్రజల సమస్యలపై పనిచేస్తూనే రాజ్యాధికారం లక్ష్యముగా విప్లవ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడమే సరైన ఎత్తుగడగా సికాస గుర్తిస్తున్నది. మా మెజార్టీ పార్టీ యూనిట్లు శాంతిని నెలకొల్పడం, సాయుధ పోరాటాన్ని విరమించడం అనే విషయంలో సానూకూల వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సికాస సోను ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను సర్దిస్తున్నదని అశోక్ తన లేఖలో స్పష్టం చేశారు.

by