CPM : నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిస్కారం కోసం పోరాటం చేసే ఒకే ఒక్క పార్టీ సీపీఎం మాత్రమేనని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మండల కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సంకె రవి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తున్న పార్టీని రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆదరించాలని కోరారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చెన్నూర్ మండలంలోని అన్ని స్థానాలకు సీపీఎం నాయకులు పోటీలో ఉంటారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. మండలంలో తమ పార్టీ డబుల్ బెడ్ రూమ్, రేషన్ కార్డు, భూమి పట్టాలు, రహదారులు, విద్య, వైద్య సమస్యల పరిస్కారం కోసం పోరాటం చేసి సాధించిన ఘనత కేవలం సీపీఎం కె దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించాలన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించిన వారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిజాయితీగా పరిపాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. చెన్నూర్ మండల కమిటీ సమావేశంకు కుందరపు చంద్రన్న అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో చెన్నూర్ మండల కార్యదర్శి బొడెంకి చందు, బొగే నాగ జ్యోతి,సిడం సమ్మక్క, బోండ్ల సరిత,నాగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

by