PDSU : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తరువాత అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదని ప్రగతిశీల యువజన సంఘం (PYL) పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరు ముళ్ళ తిరుపతి ఆరోపించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పి వై ఎల్. రాష్ట్ర రాజకీయ తరగతుల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతోనే యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు.
యువతను చైతన్య పరచడం కోసం ఈనెల 25, 26 తేదీలల్లో కోదాడలో పివైఎల్ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను ఉద్దేశించి పి వై ఎల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు ఐలయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జెవి చలపతిరావు, ఆవునూరి మధు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య,
పి వై ఎల్ రాష్ట్ర మాజీ నాయకులు గౌని ఐలయ్య ప్రసంగిస్తారని తిరుపతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బి ఆనంద్, నాయకులు కల్వల మహేందర్, ఈదునూరి బాబు, మామిడిపల్లి రాజయ్య, రవి, అనీల్.తదితరులు పాల్గొన్నారు.

by