Mustard Oil : ఆవనూనె కేవలం ఆరోగ్యానికి కాకుండా అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవనూనెను వంటలతో పాటు శరీరానికి మర్దన చేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలే వదిలిపెట్టరని నిపుణులు చెబుతున్నారు. ఆవనూనెతో వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…..
ఆవనూనె తల వెంట్రుకల సంరక్షణకు ఉపయోగపడుతుంది. తలకు రాసుకోవడం వలన కుదుళ్ళు బలంగా ఉంటాయి. చర్మానికి రాసుకోవడం వలన చర్మం తేమగా, మృదువుగా, సున్నితంగా తయారవుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి రాసుకోవడం వలన అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
ఆవనూనె రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దంత సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆస్తమా సమస్యను కూడా అదుపులో ఉంచుతుంది.