Coconut : సాధారణంగా కూరలు వండటానికి సన్ ఫ్లవర్ నూనె వాడుతారు. కొందరు ఆవ నూనె, నువ్వుల నూనె వాడుతారు. వీటన్నిటితో శరీరానికి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొబ్బరి నూనె తో కూరలు వండుకొని తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నూనె ఇమ్యూనిటీని పెంచుతుంది. గుండె సమస్యల్ని నివారిస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. బరువు తగ్గుతారు. విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.జీర్ణ సమస్యలను నివారిస్తుంది. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఎనర్జీ రెట్టింపు అవుతుంది. కొవ్వును వేగంగా కరిగించే శక్తి కొబ్బరి నూనె లో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి.