ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ చతికిలపడిపోయింది.పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల్లో ఒక్కొక్కరు సైకిల్ దిగి అధికారం ఉన్న గూటికి వెళుతున్నారు.ఇప్పడు ఆ జాబితాలో తెలుగు దేశం పార్టీలో ఉన్న నందమూరి సుహాసిని చేరబోతున్నారా ? ఆమె సీఎం రేవంత్ రెడ్దని ఏ అభిప్రాయంతో కలిసింది ?.గతంలో ఉన్న పరిచయం తో కలిసిందా ? కాంగ్రెస్ లో చేరడానికి ముందస్తుగా మర్యాదపూర్వకంగా కలిసిందా ? ఏది ఏమైనప్పటికిని ఆమె పార్టీ మారడానికే సిద్ధంగా ఉందని ఆమె సహచరుల సమాచారం.ఒకవేళ ఆమె కాంగ్రెస్ లో చేరితే పార్టీలో సముచిత స్థానం కూడా దొరుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ముందుగా సీఎం తో ఆమె జరిపిన చర్చల్లో సుహాసినికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ హామీ ఇచ్చారు అనే అభిప్రాయాలు సైతం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
15 స్థానాల్లో విజయం సాధిస్తే….
కాంగ్రెస్ అధికారం చేపట్టగానే జంప్ జిలానీల సంఖ్య పెరిగిపోతోంది.మూడు రంగుల జెండా నీడన చేరడంతో గాంధీ భవన్ నిండి పోతోంది.గులాబీ కండువాతో గెలిచిన నాయకులు,పార్లమెంట్ సభ్యులు ఓటమిచెందిన నాయకులు అంత కలిసి గాంధీ భవన్ కు వరుసకడుతున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే గులాబీ గూడు వెలవెలపోవడం ఖాయమనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 15 స్థానాల్లో విజయాన్ని ఆశిస్తోంది.అదే గనుక నిజమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.15 స్థానాలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి గులాబీ ఎమ్మెల్యేలు అధికంగా ముందుకువచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
.
ఖైరతాబాద్ నుంచే పోటీ …..
తెలుగుదేశం నాయకురాలు నందమూరి సుహాసిని రాజకీయ కుటుంబమే.అందులో సినీ పరిశ్రమతో స్నేహపూర్వక వాతావరణం. కుటుంబ సభ్యులు కూడా సినీ నటులే కావడం విశేషం. అదేవిదంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీచేసిన సుహాసిని గులాబీ అభ్యర్థికి దీటుగా ప్రచారం చేశారు.ఒక దశలో ఆమె విజయం ఖాయమనే అభిప్రాయాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 70వేల పైబడి ఓట్లు సాధించడం విశేషం.పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆమెకు ఎమ్మెల్సీ లేదా పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.కానీ ఆమెకు ఖైరతాబాద్ తో పాటు హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో సైతం మంచి పట్టు ఉంది.అందుకే ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకోడానికి సీఎం ముందుకు వచ్చినట్టుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా బరిలో ఉన్నారు.అయన గెలిచిన తరువాత ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉపఎన్నిక జరుగనుంది.ఆ స్థానం నుంచి నందమూరి సుహాసిని బరిలో ఉంటారనే అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.