Home » water : గోరువెచ్చని నీటికి అది కొంచెం కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా ?

water : గోరువెచ్చని నీటికి అది కొంచెం కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా ?

Water : ఉదయం పూట నిమ్మరసం, తేనె కలిపి తాగుతారు. కొందరు కేవలం గోరు వెచ్చని నీటినే తాగుతారు. వీటి వలన కూడా శరీరానికి మంచి ఫలితాలే లభిస్తాయి. కానీ ఉదయం కాళీ కడుపుకు గోరువెచ్చని నీటికి కొంచెం బెల్లం వేసి కరిగిన తరువాత ఆ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చెప్పలేమంటున్నారు ఆరోగ్య నిపుణులు……..

బెల్లం నీరు జీవక్రియను నియంత్రిస్తుంది. భోజనం తర్వాత దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బెల్లంలో ఉండే ఐరన్ శాతం హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. బెల్లంలోని సహజ చక్కెర శరీరానికి శక్తిని అందిస్తుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి గొప్ప పరిష్కారాన్ని అందిస్తుంది. బరువు నిర్వహణకు సహాయపడుతుంది.

బెల్లంలో ఉండే ఐరన్ శాతం ఋతు తిమ్మిరి, ఉబ్బరం, మానసిక స్థితిలో మార్పులను తగ్గిస్తుంది. దగ్గు, రద్దీ, ఉబ్బసం, బ్రోన్కైటిస్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బెల్లంలోని పొటాషియం విషాన్ని, అదనపు ద్రవాలను బయటకు పంపి, శరీరాన్ని శుద్ధి చేస్తుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *