Home » Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి… 15 మంది మృతి.

Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి… 15 మంది మృతి.

Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మౌని అమావాస్య కావడంతో తెల్లవారుజామున రెండున్నర గంటలకే భక్తులను స్నానాల ఘాట్ లోకి అనుమతి ఇచ్చారు. సెక్టార్-2 లో భక్తులు అధికంగా రావడం జరిగింది. ఒక్కసారిగా తోసుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది మృతి చెందినట్టుగా అధికార వర్గాల సమాచారం. వంద మందికి పైగా గాయాలైనట్టు సమాచారం.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అపశృతి విషయం గురించి ప్రధాని మోదీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారికి ఉన్నత చికిత్స అందించాలని ప్రధాని మోది ఆదేశించారు.

కోలుకున్న వారిని వారి గమ్యస్థానాలకు తిరిగి చేరుకోడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రధాని. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియ జేయాలని సూచించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ కు ప్రధాని సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *