Sravana Masam : ఏడాదిపాటు నిర్వహించుకునే పండుగల్లో శ్రావణమాసంలో వచ్చే పండుగలే మహిళలకు ఎంతో ఇష్టమైనవి. ఈ ఏడాదిలో శ్రావణమాసం ఆగష్టు ఐదో తేదీన ప్రారంభమై, సెప్టెంబర్ మూడో తేదీన ముగియనుంది. ముఖ్యమైన అనేక పండుగలు కూడా ఇదే మాసంలో రావడం విశేషం.
ఈ మాసంలో శివుడిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, పార్వతి దేవి వ్రతం చేసి మహిళలు తమ భక్తిని చాటుకుంటారు. వీటితో పాటు రక్షాబంధన్, నాగుల పంచమి, పొలాల పండుగ కూడా చేసి తమ భక్తిని చాటుకుంటారు. పొలాల పండుగతో శ్రావణ మాసం ముగుస్తుంది.
ఆగష్టు 5న శ్రావణ సోమవారం, ఆగస్టు 6న, మంగళ గౌరీ వ్రతం, ఆగష్టు 7న స్వర్ణ గౌరీ వ్రతం, ఆగస్టు 8న సంకష్ట హర వినాయక చతుర్థి, ఆగష్టు 9న నాగుల పంచమి, ఆగస్టు 13న, రెండవ శ్రావణ మంగళ గౌరీ వ్రతం, ఆగస్ట్ 16న వరలక్ష్మీవ్రతం, ఆగస్టు19న, పౌర్ణమి,రక్షాబంధన్ ఆగస్టు 25న, శ్రీ కృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 3న పొలాల పండుగతో శ్రావణ మాసం ముగుస్తుంది.