T 20 Catch : క్రికెట్ పోటీలల్లో ఎవరూ ఊహించని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఫైనల్ మ్యాచ్ లో ఆశ్చర్యకరమైన సందర్భాలు కూడా చోటుచేసుకుంటాయి. దింతో మ్యాచ్ మలుపు తిరుగుతుంది. ఫైనల్ కు చేరిన జట్లలో ఎదో ఒక జట్టు విజయం సాధిస్తుంది. 2007 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో శ్రీకాంత్ పట్టిన క్యాచ్ ను అభిమానులు ఇప్పటికి మరచిపోలేరు. 2011 వన్ డే వరల్డ్ కప్ లో ధోనీ కొట్టిన సిక్సర్ ను అభిమానులు మరవలేరు. ఈ సంఘటనలు భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అభిమానులు మరచిపోని సంఘటనలు. తాజాగా ముగుసిన టీ 20 వరల్డ్ కప్ పోటీలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. క్రికేట్ చరిత్రలో మరచిపోలేని సంఘటనే కాదు చరిత్రలో కలకాలం నిలిచిపోయే సంఘటన అని చెప్పవచ్చు.
తాజాగా ముగిసిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ పోటీలో సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టి చరిత్రలో నిలిచి పోయాడు. చివరి ఓవర్ కొనసాగుతోంది. దక్షిణ ఆఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 16 పరుగులు చేయాలి. అప్పుడు బౌలింగ్ లో ఉన్న హార్దిక్ వేసిన బంతిని మిల్లర్ గాల్లోకి కొట్టాడు. దాదాపుగా సిక్సర్ అయ్యే బంతి. బంతి పడే బౌండరీకి అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్ అభిమానులు ఊహించని రీతిలో బంతిని క్యాచ్ పట్టాడు. వేగంగా రావడంతో సూర్య అదుపుతప్పి బౌండరీ దాటాడు. అదుపు తప్పుతున్న విషయాన్ని గమనించి, బంతిని గాల్లోకి విసిరాడు. బౌండరీ లోపలికి తిరిగి వచ్చిన సూర్య గాల్లోకి విసిరిన బంతిని తిరిగి పట్టుకున్నాడు. సూర్య తెలివిగా క్యాచ్ పట్టుకున్న బంతి తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇండియా జట్టు విజయాన్ని ముద్దాడింది.