Bajaj Chetak : పెట్రోల్ ధరతో వినియోగదారులకు స్కూటర్ లను కొనసాగించడం కష్టమవుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కంపెనీ లు విద్యుత్ తో నడిచే స్కూటర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. తయారు చేసే కంపెనీ లు కూడా పోటీ పడి తయారు చేస్తున్నాయి. పోటీ ఉన్న నేపథ్యంలో బజాజ్ కంపెనీ ఒక సరికొత్త ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులకు అందుబాటులో పెట్టింది. ధర కూడా చాలా తక్కువగా నిర్ణయించింది.
ప్రస్తుతానికి స్కూటర్ ను ఐదు రంగుల్లో తయారు చేశారు. బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో రంగుల్లో అందుబాటులో ప్రస్తుతం ఉంది. దీని పేరు బజాజ్ సెటోక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ గా నిర్ణయించారు. ఈ చేతక్ లో కొనుగోలు దారులకు బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్-మ్యూజిక్ కంట్రోల్, హీల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్ అందుబాటులో ఉండే విదంగా తయారు చేశారు.
బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ కు 2.88 kWh బ్యాటరీ ప్యాక్‌ను బిగించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 123 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫుల్ ఛార్జ్ కావడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. సెటక్ అర్బన్, ప్రీమియం వేరియంట్‌ల కంటే కూడా దీని వేరియంట్ ధర తక్కువే అని బజాజ్ కంపెనీ ప్రకటించింది. ఈ నెల లోనే మార్కెట్ లో అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్టుగా కంపెనీ ప్రకటించింది. గంటకు 63 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీని ధర రూ.95,998 ఎక్స్-షోరూమ్ గా బజాజ్ కంపెనీ నిర్ణయించింది. కొనుగోలు పై ఆసక్తి ఉన్నవారు బజాజ్ షో రూమ్ లో ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని కూడా కంపెనీ ప్రకటించింది.