Home » Lord Ganesh Chaturthi : సంకష్టహర చతుర్థి ఎప్పుడు…. పూజా విధానం ఏమిటి

Lord Ganesh Chaturthi : సంకష్టహర చతుర్థి ఎప్పుడు…. పూజా విధానం ఏమిటి

Lord Ganesh Chaturthi : పంచాంగం శాస్త్రం ప్రకారం వినాయక చవితి ని భక్తులు ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రులను హిందువులు అందరూ భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. నిమజ్జనం అయితే పెద్ద ఉత్సవములా ఉంటది. నిమజ్జనంలో పిల్లలు, పెద్దలు పాల్గొంటారు. ముక్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంగా గడుపుతారు. ఈ వినాయక చవితి పండుగతో సమానమైన వినాయకుడి పండుగ మరొకటి ఉంది. అదే సంకష్టహర చతుర్థి. ఈ చతుర్థి ని కూడా హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చాలా విశిష్టమైనదిగా చెప్పుకుంటారు. ఇంతకూ ఈ చతుర్థి ఎప్పుడు వస్తుంది. దాని పూజా విధానం ఏమిటి అనేది తెలుసుకుందాం.

తిథుల ప్రకారం ప్రతి నెలలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి ఈ రెండు కూడా వినాయకుడికే అంకితం చేయబడ్డాయి. జ్యేష్ఠ మాసంలో తిథి ప్రకారం వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథి వస్తుంది. దీనినే మనం వినాయక చతుర్థి అని అంటారు.ఈ చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వలన మనలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటాం. ఆరోజు ఉపవాస దీక్ష చేసినా గణేశున్ని పూజించినా ఆటంకాలు తొలగిపోతాయి. ప్రత్యేక పూజ, ఉపవాసం చేసినచో గణేశుడికి జ్ఞానం, సంపద, శ్రేయస్సు అంకితం అవుతాయి.

ప్రతి తిథి కి కొంత ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటది. ఒక్కో తిథి ఒక్కో దేవునికి అంకితం చేయబడుతుంది. సోమవారం త్రినేత్రుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, గురువారం విష్ణు మూర్తి, సాయిబాబా, శుక్రవారం లక్ష్మి దేవతకు ప్రధానమైనవి గా చెప్పుకుంటారు. ఆ తిథుల ప్రకారం ఆయా దేవుళ్ళకు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. కొందరు ఇంటిలో పూజలు చేస్తుంటారు తిథుల ప్రకారం. మరికొందరు దేవాలయాల్లో పూజలు చేసి అన్నదానం కూడా చేసి భక్తిని చాటుకుంటారు. పూజలతో పాటు నియమంతో ఉపవాస దీక్ష చేస్తారు.

అదేవిదంగా గణపయ్యకు కూడా చతుర్థి తిథి ప్రధానమైనది. వినాయకుడి పూజకు శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి రెండూ సైతం వినాయకుడికి అంకితం అయ్యాయి. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి వస్తుంది. దీనినే మనం వినాయక చతుర్థి అని అంటారు. ఆ రోజు గణేశున్ని పూజించడం వలన మనకున్న ఆటంకాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.

జూన్ తొమ్మిదో తేదీన మధ్యాహ్నం 3-44 గంటలకు జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి ప్రారంభం అవుతుంది.జూన్ 10న సాయంత్రం 4-14 గంటలకు చతుర్థి తిథి ముగుస్తుంది. ఈ ఘడియల ప్రకారం భక్తులు ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. ఉపవాసం ఉండటం వలన గణేశుడికి చెందిన జ్ఞానం, సంపద, శ్రేయస్సు అన్నీ కూడా వినాయకుడికే చెందుతాయి.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *