Home » PM KCR ?? : కేసీఆర్ వెంట నడిచేవారెవరూ …

PM KCR ?? : కేసీఆర్ వెంట నడిచేవారెవరూ …

PM KCR ?? : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా గుజరాత్ కు ముఖ్య మంత్రి అయ్యారు. ఆ విదంగా మూడు సార్లు వరుసగా ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆ తరువాత దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. వరుసగా రెండుసార్లు దేశ భాద్యతలు చేపట్టారు మోదీ. ఆయన మాదిరిగానే నేను కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను. మోదీ మూడు సార్లు అయితే, నేను రెండు సార్లు అయ్యాను. ఇద్దరికీ ఒక అంకె తేడా. అది పెద్ద సమస్య కానే కాదు.

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సుపరిచితుడు. కేసీఆర్ పరిపాలన పదేళ్ళపాటు కొనసాగింది. ఆయన పగ్గాలు చేతపట్టిన నాటి నుంచి సీఎం కుర్చీ దిగిపోయే వరకు రాజపూజ్యం, అవమానం రెండూ మూట గట్టుకున్నారు. కుటుంబంలో అందరికి పదవులు, ప్రజలను కలువకపోవడం, అపరిష్కృత సమస్యలను పట్టించుకోకపోవడం, తాను చెప్పిందే వేదం అంటూ పదేళ్లు పాలనలో ఉన్నారు. చివరకు కేసీఆర్ చేతిలోనే పార్టీ పరాజయం పాలైనది. పార్టీ అపజయానికి కారకుడు కూడా కేసీఆర్ కావడం విశేషం.

మోదీ, నేను సమానమనె భావనతో కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకున్నారు. ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర సమితి గ ఉన్న పార్టీ ని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పొత్తులు పెట్టుకోడానికి దేశంలోని పార్టీల కోసం వెంపర్లాడారు. ఆయన మాటలను నమ్మి ఏ రాజకీయ పార్టీ పెద్దలు కూడా ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అనుకొని ఉన్న ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన నాయకులతో మంతనాలు జరిపారు. వారి కష్ట సుఖాల్లో భాగస్వామి అయ్యారు కేసీఆర్.

ఇంతలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. మూడోసారి గెలుపు పై ధీమాలో ఉన్న కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అధికారం చేజారిపోయింది. రాజకీయంగా ఉపాదిపోయి పోయి నిరుద్యోగులయిన నాయకులంతా కూడా కమలం, గాంధీ భవన్ గూటికి చేరుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ని బతికించుకోడానికి కేసిఆర్ నడుంబిగించినా ఫలితం అంతంత మాత్రమే కనబడుతోంది.

పార్టీ త్రిశంకు స్వర్గంలో పడింది. అయినప్పటికీ కేసీఆర్ కు ప్రధాన మంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లలేదు. లోకసభ ఎన్నికల అనంతరం ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. దేశ ప్రధాని భాద్యతలను కూడా చేపడుతానని ప్రకటించారు. ఆయన పార్టీ నుంచి ఎందరు గెలుస్తున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అదేవిదంగా ఇప్పటివరకు అయన వెంట దేశంలోని ఏయే పార్టీ లు కలిసి నడుస్తున్నాయో చెప్పడం లేదు కేసీఆర్. కనీసం పలానా పార్టీల వారు నేను కలిసి కూటమిగా ఏర్పడుతున్నామని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని చెబుతున్నారు కేసీఆర్. అదేవిదంగా బీజేపీ 200 సీట్లు మాత్రమే సాదిస్తున్నదని చెప్పేస్తున్నారు. ఇదంతా నేను చెబుతున్నది కాదు. సర్వే వాళ్ళు చెబుతున్న మాట అంటున్నారు. అటువంటప్పుడు ఆ సర్వే వాళ్ళు దేశంలోని ఏయే ప్రాంతీయ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో కేసీఆర్ కు ఎందుకు చెప్పలేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అవసరమైతే కాంగ్రెస్, బీజేపీ పార్టీ వాళ్లే కూటమికి మద్దతు ఇస్తామని వస్తారు. కానీ మేము మాత్రం ఆ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వం అని చెప్పడం కొసమెరుపు.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *