Home » మంచిర్యాల కమలంలో లుకలుకలు

మంచిర్యాల కమలంలో లుకలుకలు

నేతలకు క్రమశిక్షణ నోటీసులు
నోటీసులపై చెవులు కోరుక్కుంటున్న పార్టీ శ్రేణులు
రాష్ట్ర పెద్దల వద్దకు నోటీసు పంచాయితీ

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించడానికి BJP ఢిల్లీ పెద్దలు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తున్నారు. క్యాడర్ పెంచుకోడానికి ఆకర్ష్ పథకాలను సైతం ప్రవేశ పెడుతున్నారు. ఇతర పార్టీ శ్రేణులను తీసుకోండి. కానీ మన పార్టీ నుంచి ఒక్కరు కూడ బయటకు వెళ్లకుండా కూడా చూడాలంటూ ఆదేశాలు కూడా వినబడుతున్నవి. పార్టీ కోసం అగ్రనాయకులు కష్టాలు పడుతుంటే, మంచిర్యాల జిల్లాలో మాత్రం క్రమశిక్షణ గల నాయకులు ఎంత ఉంటె అంత సరిపోతుంది అనే పద్దతిని జిల్లా కమిటీ అవలంబిస్తోందనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. క్రమశిక్షణ పేరిట మంచిర్యాల జిల్లాలోని పలువురు నాయకులకు నోటీసులు పంపింది BJP జిల్లా కమిటీ. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని కమలంలో ఒక్కసారిగా లుకలుకలు మొదలైనాయి.

అసెంబ్లీ, పార్లమెంట్,సర్పంచి ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కస్టపడి పనిచేసిన నాయకులకు ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రెండో స్థానం పార్టీ శ్రేణులు కష్టపడనిదే వచ్చిందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే పార్టీ అభ్యర్థుల కోసం రాష్ట్ర కమిటీ పంపిన నిధుల్లో అక్రమాలు జరిగాయని పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. వాటి లెక్కలు ఎందుకు పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ప్రకటించలేదంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నిధుల ఖర్చు గురించి నాకేమి తెలియదని జిల్లా కోశాధికారి చెప్పడంలో వెనుక ఉన్న అర్థమేమిటో జిల్లా కమిటీ ప్రకటించాలంటున్నారు పలువురు నేతలు. మున్సిపల్ ఎన్నికల ఖర్చు పై పలు పత్రికలకు ఉప్పందించగా వచ్చిన వార్తలపై విచారణ చేసి ఎందరికి నోటీసులు ఇచ్చారో కూడా చెప్పాలంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కూడ కొందరు ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన విషయంపై కూడా విచారణ చేయాలంటున్నారు. అదే విదంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడ ఒక జిల్లా స్థాయి కమలం నేత మరో పార్టీ అభ్యర్థి విజయం కోసం కక్కుర్తి పడినట్టుగా ఆరోపణలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటున్నారు. అదేవిధంగా తూర్పు జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి పార్టీ ఆనవాళ్లు లేని రోజుల్లో అధ్యక్ష భాద్యతలు చేపట్టి పార్టీకి ఒక గుర్తింపును తీసుకురావడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు ఒక్కరు కూడా రాష్ట్ర నేతలు కూడా పలకరించలేదు. ఆయన ఆరోగ్యపరిస్థితిని రాష్ట్రస్థాయిలో వివరించి వైద్య పరంగా ఎందుకు ఆదుకోలేదంటున్నారు పలువురు జిల్లా నేతలు. పార్టీ ఉనికిని కాపాడిన నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్నారు పలువురు పార్టీ శ్రేణులు.

వేమనపల్లి మండల అధ్యక్షుడు మధుకర్ నాకు ప్రాణభయం ఉందని వేడుకుంటే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించి ఎందుకు రక్షణ కల్పించలేదంటున్నారు. మధుకర్ హత్య అనంతరం మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలను పార్టీ ఎంతవరకు అమలు చేసిందని కూడా పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. చెప్పుడు మాటలు విని కష్టపడుతున్న వారిపై క్రమశిక్షణ పేరుతొ నోటీసులు ఇవ్వడం పార్టీ అభివృద్ధికి సరైన పద్దతి కాదనే అభిప్రాయాలు జిల్లాలో వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *