NIGAMA MEDIA (P) LTD
21.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే టీజేఏ ధ్యేయం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సభ్యత్వమే సంఘానికి బలం,
23న టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక
టీజీఏ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ కుమార్

కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల):

ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంఘం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన విశిష్ట పాత్రను గుర్తుచేసిన ఆయన, అదే ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి స్వేచ్ఛ పరిరక్షణ కోసం టీజేఏ అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీజేఏ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, బీమా, పెన్షన్ వంటి న్యాయమైన డిమాండ్ల సాధనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంఘం నిరంతరం పోరాడుతోందని అయన వివరించారు. ప్రతి జర్నలిస్టు హక్కును కాపాడటమే టీజేఏ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన పార్వతి సురేష్ కుమార్, సభ్యత్వమే సంఘానికి బలం, ఐక్యతే విజయానికి మార్గమని అన్నారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్ మీడియా జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున సభ్యత్వం స్వీకరించి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

జూలై 23న నిర్వహించే టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు డేగ ఆంజనేయులు, మాసు రాకేష్, సోదరి దుర్గయ్య, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.