NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

తిరుగులేని 12 ఏళ్ల మోదీ పాలన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆర్థిక వ్యవస్థ బలోపేతం
అవినీతి రహిత పరిపాలన
తెలంగాణ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కమిటీ

కోల్ బెల్ట్ ప్రతినిధి(హైదరాబాద్):

భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, హర్ ప్రీత్ సింగ్, మహేందర్ సజ్జన్ లాల్లతో కూడిన ప్రతినిధి బృందం శనివారం సమాజంలోని పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకుంది.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిన 12 సంవత్సరాల పాలన, దేశ అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక పురోగతి వంటి అంశాలను వివరించే ప్రత్యేక పుస్తకాన్ని వారికి అందజేశారు.

ప్రతినిధి బృందం రిటైర్డ్ మేజిస్ట్రేట్ విష్ణు సహాయ్, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీనివాసన్, ప్రముఖ వ్యాపారవేత్తలు అశోక్ నీమ్కర్, మహావీర్ టాటెడ్, మహాజన్ బ్యాంక్ అధ్యక్షుడు పరస్మల్ రాంకా, సికింద్రాబాద్ జైన్ సంఘ్ అధ్యక్షుడు శాంతిలాల్ బోహ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ కటారియా, చైర్మన్ సంపత్‌రాజ్ కొఠారిలను కలుసుకుని పుస్తకాన్ని అందించారు.

ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రశంసనీయమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగ్ మోహన్ సింగ్, రజనీష్ జైన్ లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.