సింగరేణిలోనే ఎందుకు ప్రయాణం ?
సింగరేణినే ఎందుకు లక్ష్యం చేసుకున్నారు ?
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇటీవల సింగరేణి బొగ్గు గనులపై సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం మొట్టమొదటి పెద్ద కార్యక్రమం ఇదే కావడం విశేషం. సింగరేణినే ఎందుకు ఎంచుకున్నారు. సింగరేణినే ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. పార్టీ ఆవిర్భావం తరువాత ఆమె రాజకీయ ప్రయాణం అక్కడినుంచే ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది….
సింగరేణిలో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు 27 డిసెంబర్ 2023న నిర్వహించారు. నాలుగేళ్ల తరువాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. అంటే మరో ఏడాదిన్నరలో సింగరేణిలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల అనంతరం మరో ఏడాదికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సింగరేణి గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రామగుండము, భూపాలపల్లి, మంథని,పినపాక, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాలు ఉన్నవి. సుమారు 40 వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పదవీ విరమణ పొందిన కార్మిక కుటుంబాలు సైతం ఆ పది నియోజకవర్గాల్లో ఉన్నారు.
భవిష్యత్తు కోసమే కవిత హెచ్ఎంఎస్ కార్మిక సంఘాన్ని చేపట్టారు. సింగరేణిలో కార్మిక గుర్తింపు సంఘంగా ముందుగా గెలిపించుకోవాలి. కార్మిక గుర్తింపు సంఘంగా గెలువలేకపోయినా కనీసం బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ , RG -1,2,3, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కార్పొరేట్ ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లోనైనా ప్రాతినిధ్య సంఘంగా గెలిచి సత్తా చాటాలి. ఈ నేపథ్యంలో సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలోపేతం అవుతుంది. సింగరేణి ఎన్నికల తరువాత ఏడాదికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గెలిచిన HMS ను సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవచ్చనేది కవిత ఆలోచన. అందుకోసమే రాజకీయ ఎత్తులో భాగంగా కవిత సింగరేణి కార్మిక ఓటర్లపై కనేసినట్టుగా తెలుస్తోంది.

by