రెండేళ్ల ముందుగానే కవిత పార్టీలో టికెట్లకు పోటీ
నేతకాని వర్గం నాయకుడికి కవిత హామీ
టిఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్న నాయకుడు
కోల్ బెల్ట్ న్యూస్(చెన్నూర్):
కల్వకుంట్ల కవిత. TRS పార్టీని స్థాపించిన నాయకురాలు. పార్టీ కి సంబందించిన వ్యవహారాలు ఇంకా పూర్తి కాలేదు. కానీ అప్పుడే మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి కొందరు నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. పార్టీలో చేరడానికి సరైన సమయం కోసం పలువురు నేతలు వేచి చూస్తున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం.
ఇది ఇలా ఉండగా చెన్నూర్ నియోగజకవర్గం అత్యంత ఖరీదయిన స్తానం. ఎందుకంటే అక్కడ ప్రస్తుత మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. BRS బాల్క సుమన్ ఉన్నారు. వీరిద్దరిని తట్టుకోవాలంటే ఖరీదయిన వ్యక్తి బరిలో ఉండాలి. అందుకేనేమో కవిత పార్టీలో ఓ ఖరీదయిన నేతకాని వర్గంకు చెందిన నేత బరిలో ఉండటానికి సిద్దపడినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో పలు ఎన్నికల్లో కూడా పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుతానికి ఆయన ఒక పార్టీ లో జెండా మోస్తున్నారు.
అందులో కలిసిరావడం లేదనుకొని కొత్త పార్టీలోకి రావడానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. అంతే కాదు ఆయన ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో ఈపాటికే మంతనాలు జరిపారని రాజకీయ వర్గాలు చెవులు కోరుకుంటున్నారు. ఆ మాజీ మంత్రితో కలిసి ఆ నేతకాని నేత కవిత తో కూడా మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేతకాని నేత చెన్నూర్ టికెట్ కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. సరే. మరి ఇదే స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యే మాజీ మంత్రి బోడ జనార్దన్ కవిత పార్టీలో చేరారు. ఈ ఇద్దరిలో ఎవరికీ టికెట్ దక్కుతుందో వేచిచూడాల్సిందే.

by