Home » Singareni : కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సింగరేణి యాజమాన్యం

Singareni : కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సింగరేణి యాజమాన్యం

Singareni : బెల్లంపల్లి పట్టణంలో కబ్జాకు గురవుతున్న సింగరేణి క్రాస్ కట్ గని భూమిని కాపాడాలంటూ బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ నాయకులు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ స్పందించి ఆ భూమి చుట్టూ కంచెవేయించడం జరిగిందని బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా పరిరక్షణ కమిటీ నాయకులు మందమర్రి జనరల్ మేనేజర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగ పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పలు సింగరేణి భూములను కబ్జా చేయడానికి కొందరు పాల్పడు తున్నారని ఆరోపించారు. సింగరేణి భూములను కబ్జా చేసి అమ్ముకొని సొమ్ముచేసు కుంటున్నారని నాయకులు ఈ సందర్బంగ ఆరోపించారు. భవిష్యత్తులో అటువంటి భూములను ఎవరు కూడా కొనరాదని బెల్లంపల్లి పట్టణ ప్రజలను కోరారు. భూ కబ్జా దళారులను నమ్మి మోసపోరాదన్నారు.

ఈ కార్యక్రమంలో ఆడెపు రాజమౌళి సిపిఐ పట్టణ కార్యదర్శి,, కొంకుల రాజేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు, గెల్లి జయరాం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి,, MD అఫ్జల్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆడెపు మహేష్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి, ,పసుపులేటి వెంకటేష్ ఎం సిపిఐ యూ జిల్లా సహాయ కార్యదర్శి,, అమానుల్లా ఖాన్ టిడిపి ఉమ్మడి జిల్లా కార్యదర్శి,, అంబాల మచ్చయ్య టిడిపి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *