BRS : ఎత్తుకు పై ఎత్తులు వేసి రాజకీయ నాయకులను, పార్టీలను చిన్నాభిన్నం చేసిన నాయకుడు కేసీఆర్. అటువంటి నేత రాజకీయంగా కుటుంబాన్ని, పార్టీని చక్కదిద్దుకోలేక చతికిలపడిపోయాడా ? అంటే అవుననే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలను లేఖ ద్వారా కవిత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ లేఖ బయటకు పొక్కడంతో కుటుంబంతో పాటు, పార్టీలో విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అప్పటి నుంచి కవిత ఎదో ఒక సందర్భంతో పార్టీ తో పాటు నేతలపై కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె ఆరోపణలు చేయడం వెనుక వివిధ రకాల ఆరోపణలు బయటకు పొక్కాయి. అస్తి కోసమే అయితే ఒకవేళ కేసీఆర్ పంపిణి చేసిన నేపథ్యంలో వాటి విలువలు బయటకు పొక్కేవి. అప్పుడు రాజకీయ పరంగా వెంటపడే వారు ఉన్నారు. దింతో అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ పార్టీ పరంగా ఆమెకు పదవే కావాలనుకుంటే ఇచ్చే ఉద్దేశం కేసీఆర్ కు అసలే లేదు. ఇప్పటికే కుటుంబ పార్టీ అంటూ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అందుకే కవితను పార్టీ పదవికి, మంత్రి పదవికి దూరం పెట్టారు అనే అభిప్రాయాలు సైతం ఉన్నవి. హరీష్ రావు పై అవినీతి ఆరోపణలు చేశారు కవిత. ఒకవేళ ఆమె చెప్పిన మాటలు నిజమైతే కేసీఆర్ కు తెలియ కుండా ఉండవు. పదేళ్ల కాలంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు చెందిన ప్రతి విషయం ఆయన గుప్పిట్లో ఉంది. కొత్తగా కవిత చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గా గెలిచిన వారిలో సాధ్యమైనంత మేరకు ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకున్నారు. అందులో టీడీపీ ని అయితే ఎంత వరకు తొక్కి పెట్టాలో అంత వరకు తొక్కేసాడు. చివరకు నరనరాల్లో జీర్ణించుకు పోయిన కమ్యూనిస్టులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. ప్రతిపక్ష నాయకుడు అనే పదం లేకుండ చేసిన కేసీఆర్ కు రాజకీయంగా కవితను అదుపు చేయడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ రెండే, రెండు అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి రాజకీయంగా పార్టీ పదవా ? లేదంటే ఆస్తి గొడవా ? రెండింటిలో ఏదయినా పరిష్కరించే సత్తా ఉన్న నేతనే కేసీఆర్. ఈ రెండు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. సప్త సముద్రాలు ఈదిన వ్యక్తి ఇంటి ముందర బోల్తా పడిన సామెతను గుర్తు చేస్తోంది ప్రస్తుత కేసీఆర్ తీరు. పార్టీ క్రమశిక్షణ మేరకు చర్యలు అనవచ్చు. కానీ కవిత ను రాజకీయంగా అదుపుచేయలేని కేసీఆర్ కు రాబోయే ఎన్నికల నాటికి పార్టీ తన అదుపులో ఉంటుందా ? అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

by