Home » Singareni : సింగరేణిలో కొందరికి చుట్టమైన విజిలెన్స్ చట్టం

Singareni : సింగరేణిలో కొందరికి చుట్టమైన విజిలెన్స్ చట్టం

అదనపు ధరకు ఎక్స్‌ప్లోసివ్ కొనుగోలు
KTK OC OB తొలగింపు కాంట్రాక్ట్ టెండర్ వాయిదాకు కారకులెవరు ?
సత్తుపల్లి CHP నిర్మించిన రెండేళ్లకే ఎందుకు కూలింది ?
మంత్రి కుటుంబాన్ని విదేశీ పర్యటనకు తీసుకెళ్లింది ఎవరు ?
గుజరాత్ పర్యటన చేసింది ఎవరికోసం ?

Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి విజిలెన్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది యాజమాన్యం. ఇందులో అనేక కఠినమైన నిబంధనలు పొందుపరిచారు. ఈ కఠినమైన నిబంధనలు ఇప్పటివరకు సంస్థలో జరిగే అవినీతిని బయటకు తీసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదంటున్నారు పలువురు కార్మికులు. కార్మికులపై ప్రయోగాలు చేసిన సందర్భాలు అనేకం. టెండర్లు, కొనుగోలు, బొగ్గు సరఫరా, నియామకాలు, నిర్మాణాలు, పదోన్నతులు, బదిలీల విషయంలో పలువురి ఉన్నతాధికారుల పాత్ర ఉంది. దీన్ని మేము బహిర్గతం చేసి, చట్ట పరంగా చర్యలు తీసుకున్నాం అనే సందర్భం ఎక్కడ కూడా సింగరేణిలో కనబడలేదని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.

గనులల్లో బ్లాస్టింగ్ కు ఉపయోగించే ఎక్స్‌ప్లోసీవ్స్ ను ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసింది సంస్థ. టన్నుకు అధనంగా రూ : 4500 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడంతో సంస్థపై అధనంగా రూ : 350 కోట్ల భారం పడిందంటున్నారు కార్మికులు. భూపాలపల్లి ఏరియా KTK OC OB తొలగింపు కాంట్రాక్ట్ టెండర్ 10 సార్లు వాయిదా పడింది. ఎస్వీ అనే సంస్థకు ఈ కాంట్రాక్టు ఇవ్వాలనేది ఆలోచన. ఈ కాంట్రాక్టు టెండర్ విలువ రూ : 320 కోట్లు. ఏడు శాతం కమిషన్ ను కొందరు సంబంధిత అధికారులు ఆశించడంతోనే టెండర్ ప్రక్రియ వాయిదా పడిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల రాష్ట్రానికి చెందిన ఒక ప్రథమ శ్రేణి మంత్రి కుటుంబంతో పాటు, సీఎండీ కార్యాలయానికి చెందిన ఒక అధికారి మూడు నెలల్లో పదవీ విరమణ పొందే సమయంలో అతని కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనకు సంస్థ ఖర్చులతో పంపింది వాస్తవం కదా అని కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది. తమ వ్యక్తిగత అవసరాల కోసం కొందరు అధికారులు ఇటీవల కొందరు ఐఏఎస్ స్థాయి అధికారులను గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ ఐపీఎల్ మ్యాచ్ కు ఏర్పాట్లు, వెళ్లి, రావడంతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఈ పర్యటన సంస్థ అభివృద్ధి గురించి అంటే అసలే కాదు. ఈ ఖర్చులు సంస్థ నుంచి వెచ్చించిన విషయం మీకు తెలియదా ?అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ ల పదోన్నతులు, వారి బదిలీల విషయంలో జరిగే అవినీతి అంతా, ఇంత కాదంటున్నారు కార్మికులు. ఈ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా జరిగాయని విజిలెన్స్ టీం అంగీకరిస్తుందా అని కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది.

సత్తుపల్లి లో నిర్మించిన CHP నిర్మాణానికి జరిగిన టెండర్లలో భారీ అవినీతి జరిగిందని పలువురు ద్వితీయ శ్రేణి అధికారులతో పాటు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇది మరో కాళేశ్వరం అంటున్నారు సింగరేణిలో. సింగరేణిలో ఇప్పటి వరకు నిర్మించిన CSP , CHP లు మూతపడిన తరువాత కూలగొడితేనే కూలిపోయాయి. కానీ సత్తుపల్లిలో నిర్మించిన CHP రెండేళ్లకే నేలమట్టం కావడం విశేషం. ఈ సంఘటన విజిలెన్స్ బృందానికి కనబడుత లేదా అని కార్మికవర్గం ప్రశ్నిస్తోంది. వాస్తవానికి ఆ chp టెండర్ ధర రూ : 250 కోట్లని అధికార గణాంకాలు చెబుతున్నాయి. కానీ రూ : 150 కోట్లు అదనంగా వెచ్చించి కేటాయించారు. కట్టిన రెండేళ్లకే రూ : 400 కోట్లు నేలరాలిపోయాయి. ఇది సింగరేణి కాళేశ్వరం అవినీతి ని గుర్తు చేస్తోందంటున్నారు కార్మికులు. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ టీం తనకేమి పట్టనట్టుగా వ్యవహరించడం సరికాదంటున్నారు కొందరు ద్వితీయ శ్రేణి అధికారులతోపాటు కార్మికులు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *