Ethik : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీ లో ఆషాడ మాసం పురస్కరించుకొని గురువారం గోరింటాకు సంబరాలు ఆనందంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గోరింటాకు తయారు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల చేతులకు మైదాకు అలంకరించారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ గోరింటాకు ప్రాముఖ్యతను వివరించారు.
వర్షాకాలంలో ఎక్కువగా సంచరించడం వలన కాలి వేళ్ళు, చేతుల వేళ్లు పగుళ్లు తేలుతాయి. పగుళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం వలన పగుళ్ళను నివారిస్తుంది. ఆషాడంలో కాకుండా అప్పుడప్పుడు కూడా గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. చర్మంపై దురదలు రాకుండా నివారిస్తుంది. గోరింటాకు ను తలకు ప్రతినెలకోసారి పెట్టుకోవడం వలన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుందని చరణ్ రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు