BJP : తెలంగాణ రాష్ట్ర కమల దళపతి ఎన్నిక ఎట్టకేలకు ఖరారు అయ్యింది. అధిష్టానం కూడా ఆయన పేరును ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయాల్సిందిగా తెలిపింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాటా నెగ్గింది. కాషాయం మూలాలు ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిని చేయాలనుకున్నది సంఘ్ పరివార్. అదేవిదంగా జరిగింది. ఆయనే మాజీ ఎమ్మెల్సీ నరపరాజు రామచందర్ రావు. తెరపైకి ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ, లక్ష్మణ్, రఘునందన్ రావ్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పార్టీలో కూడా ఆయనే అంటా కూడా చెవులు కోరుకున్నారు. చివరకు ఎన్ రామచందర్ రావు పేరు ఖరారు చేస్తూ ఢిల్లీ పెద్దలు నామినేషన్ వేయాల్సిందిగా ఆయన్ని కోరారు.
విద్యార్ధి దశలోనే రామచందర్ రావు రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కళాశాల్లో బీఏ చదివారు. వరుసగా మూడు సార్లు ఏబీవీపీ తరుపున కళాశాల అధ్యక్షుడిగా ఎన్నికయినారు. ఉస్మానియా లా కళాశాల కు రెండు సార్లు ఏబీవీపీ తరుపున కార్యదర్శిగా ఎన్నికయినారు. విద్యార్ధి దశలోనే రాంచందర్ రావ్ 14 సార్లు జైలు శిక్ష అనుభవించారు.
ఎన్ రామచంద్ర రావు హైదరాబాద్ నివాసి. వృత్తి న్యాయవాది. భారతీయ జనతా యువ మోర్చాకు మొదటి రాష్ట్ర కార్యదర్శి గా భాద్యతలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా నియామకం. జాతీయ లీగల్ సెల్ కు జాయింట్ కన్వీనర్ భాద్యతలు. 2008 లో ఉమ్మడి రాష్ట్రానికి పార్టీ ప్రతినిధి గా భాద్యతలు. 2011-2013 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా భాద్యతలు నిర్వహించారు. 2015 లో బీజేపీ తరుపున ఎమ్మెల్సీ గా ఎన్నిక. 2017 పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడిగా భాద్యతలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జ్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.
పార్టీ ఏ పని అప్పగించినా మాట రాకుండా చేసి పెట్టడం. ఎలాంటి పదవి కట్టబెట్టిన కాదనకుండా భాద్యతలు చేపట్టడం. గ్రూపులకు దూరం. ఆయనతో కలిసి పని చేయాలంటే క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి అనే పేరు ఉంది. పక్కా కాషాయం భావాలు. ఇతరుల మనసు నొప్పించకుండా తన పని తానూ చేసుకోవడం. ఇవే ఆయనకు అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారణమంటున్నారు బీజేపీ శ్రేణులు.
పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్.