కోల్ బెల్ట్ ప్రతినిది
ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు విష్ణు,మనోజ్,లక్ష్మి ప్రసన్న సంతానం. అంటే ఇద్దరు అబ్బాయిలు,ఒక అమ్మ్మాయి మోహన్ బాబు సంతానం.కానీ ఇప్పుడు ఆ నటుడి ఇంట్లో అంత ఆడపిల్లలే సందడి చేస్తున్నారు.ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు అమ్మాయిలు సందడి చేయబోతున్నారు. ఆ ఇంట్లో ఎటుచూసినా అమ్మాయిలు కాళ్ళ గజ్జెల చప్పుళ్ళే వినిపిస్తాయి. మోహన్ బాబు ఆ పిల్లలకు దుస్తులు కొనుగోలుచేసినా ఒకే డిజన్ ఉన్నవి కొనాలి. వేరు వేరు కొంటె నచ్చకపోవచ్చు. లేదంటే నాకు ఇదే కావాలి అంటే,నాకు ఇదే కావాలి అంటూ తాతయ్యను ఏడిపిస్తారు.
మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కు సంతానం ముగ్గురు ఆడపిల్లలు. అదేవిదంగా కూతురు లక్ష్మి ప్రసన్నకు సరోగసీ ద్వారా ఒక అమ్మాయి ఉంది. అంటే ఆ ఇద్దరికీ కలిపి నలుగురు ఆడపిల్లలు. ఇదిలా ఉంటె మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ అతని భార్య పేరు భూమా మౌనిక . ఆ ఇద్దరి తొలి సంతానం కూడా ఆడపిల్లనే. శనివారం మౌనిక పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని మంచు లక్ష్మి ప్రసన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆ అమ్మాయికి ఎంఎం పులి అని నిక్ నేమ్ పెట్టారు.మరి ముద్దు పేరు అయితే ప్రకటించారు.కాని అసలు పేరు తాతయ్య, నానమ్మ, పెద్దనాన్న,పెద్దమ్మ,మేనత్త కలిసి ఏమి పేరు పెడుతారో అని మోహన్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా అచ్చం మేనత్త పోలికలతోనే పుట్టిందని అంటే తనలాగే ఉందని మంచు లక్ష్మి తన మేనకోడలిని చూస్తూ మురిసిపోతూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం విశేషం.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-