Home » Sai : హీరో సాయి ధరమ్ తేజ్ కు పోలీస్ నోటీసులు, ఎందుకో తెలుసా ?

Sai : హీరో సాయి ధరమ్ తేజ్ కు పోలీస్ నోటీసులు, ఎందుకో తెలుసా ?

Sai : మెగా కుటుంబం వారసుడు సాయి ధరమ్ తేజ్ సినిమా కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారు. రోడ్ ప్రమాదం జరిగిన తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. విరూపాక్ష సినిమా తరువాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ‘ సంబరాల ఎటి గట్టు ‘ సినిమా చేస్తున్నాడు. సోలో, బ్రతుకే సోబెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో తన అభిమానులను మెప్పించాడు తేజ్. సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ అనే సినిమాను నిర్మిస్తున్నట్టుగా ప్రచారం చేశారు. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఎక్కడ గంజా శంకర్ సినిమా గురించి అటు చిత్ర పరిశ్రమలో గాని, ఇటు అభిమానుల్లో గాని చర్చ లేదు. దీని పై తాజాగా దర్శకుడు సంపత్ నంది స్పందించాడు.

గంజా శంకర్ సినిమా గురించి తాజాగా దర్శకుడు సంపత్ నంది స్పందించాడు. నాకు, సాయి ధరమ్ తేజ్ కు, నిర్మాతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దింతో సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది. సినిమా పేరు మార్చాలని పోలీసులు తెలిపారు. కానీ పేరు మారిస్తే సినిమా కథ కూడా మార్చాల్సి ఉంటుందని దర్శకుడు నంది తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *