Singareni : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) శ్రీరాంపూర్ బ్రాంచ్ ట్రేడ్స్ మేన్స్ సమావేశాన్ని మార్చి 2 న సిసిసి కార్నర్ లోని ఏఐటీయూసీ కార్యాలయం నర్సయ్య భవన్ లో నిర్వహిస్తున్నామని శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా తెలిపారు.
ఎస్ ఆర్ పి త్రీ గనిలో టెక్నీషియన్స్ , మెకానికల్ ఎలక్ట్రికల్ ఫోర్ మెన్స్ ల సమావేశంలో ఎస్కె బాజీ సైదా మాట్లాడుతూ ఏఐటియుసి ట్రేడ్స్ మేన్స్, ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ సూపర్వైజర్లు పక్షాన పోరాటాలు నిర్వహించి అనేక హక్కులు సాధించి పెట్టిందన్నారు. భవిష్యత్తులో కూడా ట్రేడ్స్ మేన్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ఏఐటీయూసీ ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
యూనియన్ బలోపేతంతోపాటు, ట్రేడ్స్ మెన్ ల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం మార్చ్ 2న నిర్వహించే యూనియన్ సమావేశానికి టెక్నీకల్ విభాగాలకు చెందిన వారందరు హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో ట్రేడ్స్ మేన్స్ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, నాగభూషణం, సురేష్, ఆళ్ల వెంకట్ రెడ్డి, మురళీ చౌదరి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.