criket : ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకోడానికి ఇండియా, పాకిస్తాన్ జట్లు కుస్తీపడుతున్నాయి. అందులో భాగంగా దుబాయ్ వేదికగా రెండు జట్లు తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని పాకిస్తాన్ జట్టు రంగంలోకి దిగింది. పాకిస్తాన్ జట్టు 241 పరుగులు చేయడంతో ఇండియా జట్టు 242 పరుగుల లక్ష్యంతో ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఆడుతూ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.
విరాట్ కోహ్లీ వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు
287 ఇన్నింగ్స్‌ల్లో (299 మ్యాచ్‌లు) ఆడి ఈ ఫీట్‌ను అందుకున్న విరాట్ కోహ్లీ
వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ