Electric-Scooter : రోజు రోజుకు వాహనాల కొనుగోలు. దింతో కాలుష్యం పెరుగుదల. మరొక విదంగా చెప్పాలంటే భారమైన పెట్రోల్ ఖర్చు. దీన్ని ఎదుర్కోడానికి కొన్ని మోటార్ తయారీ కంపెనీలు విద్యుత్ ఛార్జ్ తో నడిచే వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఒక సంస్థ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకు రావడం విశేషం. ఆ వాహనాన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 136 కిలో మీటర్లు ప్రయాణించే విదంగా ఒక సంస్థ తయారు చేసి మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ నెలలోనే బుకింగ్ కూడా ప్రారంభించింది. రూ: 9999 చెల్లించి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుకింగ్ చేసుకోడానికి ప్రచారం కూడా మొదలు పెట్టింది.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ మార్కెట్ లోకి కొత్త స్కూటర్ ను అందుబాటిలోకి తెచ్చింది. ఆంపియర్ బ్రాండ్ పేరుతో ఆంపియర్ నెక్సస్ సిరీస్ లో నెక్సస్ ఎక్స్, నెక్సస్ ఎస్‌టీ పేరుతో రెండు కొత్త మోడళ్లను ప్రవేశ పెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.? ఖరీదు ఎంత.? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.బెంగళూరులో స్కూటర్ డెలివరీలు ప్రారంభించింది కంపనీ.
3.3 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి విద్యుత్ ఛార్జ్ చేస్తే 136 కిలో మీటర్లు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. గంటకు 93 కిలోమీటర్ల వేగం. పవర్ మోడ్‌లో లభిస్తుంది. బ్యాటరీ 4 కిలోవాట్స్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఎకో, సిటీ, పవర్, లింప్ హౌస్, రివర్స్ మోడ్‌తో ఐదు రకాల మోడళ్లను తయారు చేసి మార్కెట్లో ప్రవేశ పెట్టింది..
4 కలర్ వేరియంట్స్‌లో స్కూటర్లు ఉన్నాయి. ఆక్వా, తెలుపు, బూడిద, రెడ్ కలర్స్‌లో వినియోగదారులకు సిద్ధంగా ఉంచింది. 12 ఇంచెస్‌తో కూడిన అలాయ్ వీల్స్. ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు బిగించారు. టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. నెక్సస్ ఎక్స్ రూ. 1.20 లక్షలుగా నిర్ణయించారు, నెక్సస్ ఎస్‌టీ ధర రూ. 1.30లక్షలుగా తయారీ సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు బెంగుళూర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.