Love marriage actor : 1989 లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ప్రముఖ అగ్ర హీరో బాలకృష్ణ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వెనుదిరిగి చూడలేదు. సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. అక్క, చెల్లె, వదిన, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. బ్రహ్మానందం, ధర్మవరం సుబ్రహ్మణ్యం, అలీ, వేణు మాధవ్ లతో కలిసి నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకొంది. మొట్టమొదటిసారిగా 1989 లోబాలకృష్ణ హీరోగా నటించిన ” భలే దొంగ ” సినిమాలో నటించింది. అప్పటి నుంచి ఆ తెలుగు సినీ నటి తీరిక లేకుండా కెమెరాతోనే ఎక్కువ కాలం గడిపింది.
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ప్రేమలో పడిన తీరు, ఆ తరువాత పెళ్లి గురించి వివరించింది. దూరదర్శన్ లో ఆ తెలుగు నటి పనిచేస్తున్నప్పుడు సయ్యద్ జాన్ అహ్మద్ అనే వ్యక్తి అసిస్టెంట్ కెమెరా మాన్ గా దూరదర్శన్ లోనే పనిచేస్తున్నాడు. అప్పుడే పరిచయం అయ్యింది అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అతనితో. పరిచయం కాస్త ప్రేమగా మారింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశారు. పరిచయం, ప్రేమ లో చూసిన ఆయన మంచి వ్యక్తిగా తెలిసిపోయింది. మోసం చేసే వ్యక్తిగా అనిపించ లేదు. వెంటనే నేను కూడా ఒప్పేసుకున్న. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి గుర్తుగా ఈషా అనే ఒక కూతురు ఉంది అని తన జీవిత విశేషాలను కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిన నటి ఎవరనుకుంటున్నారా హేమ. ఆమె ఇటీవల బెంగుళూర్ లో రేవ్ పార్టీలో దొరికి నేను హేమ కాదు, కృష్ణవేణి ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరిన తెలుగు సినీ నటి