Home » తిరుమలకు భారీ విరాళాలు ప్రకటించిన అనంత్ అంబానీ

తిరుమలకు భారీ విరాళాలు ప్రకటించిన అనంత్ అంబానీ

టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు –
50 మంది డ్రైవర్ల వేతనాల బాధ్యత కూడా రిలయన్స్ సంస్థనే

కోల్ బెల్ట్ న్యూస్(తిరుమల):

తిరుమల–తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందజేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.

అంతేకాకుండా, ఈ బస్సులను నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్ల వేతనాలను కూడా తానే భరిస్తానని అనంత్ అంబానీ తెలిపారు. దీంతో టీటీడీపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, పర్యావరణహిత రవాణా వ్యవస్థకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం తిరుమలలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలతో తిరుమలలో కాలుష్యం తగ్గి, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అనంత్ అంబానీ చేసిన ఈ విరాళాలు, సేవా కార్యక్రమాలను భక్తులు, ప్రజలు హర్షిస్తూ అభినందిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు, ఆధునిక రవాణా సదుపాయాల అభివృద్ధికి ఇవి కీలకంగా మారనున్నాయని భావిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *