Home » scheme :గర్మిణీలకు రూ: 5 వేలు. కేంద్ర ప్రభుత్వ పథకం

scheme :గర్మిణీలకు రూ: 5 వేలు. కేంద్ర ప్రభుత్వ పథకం

scheme : కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఆర్థికంగా ఎదగడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇస్తోంది. పరిశ్రమలను స్థాపించడానికి కూడా పెట్టుబడి సహాయం చేస్తోంది. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం కూడా ఆర్థిక సహాయం అందిస్తోంది. అందులో భాగంగా గర్భిణీలను ఆరోగ్య పరంగా ఆదుకోడానికి కూడా ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తోంది.

గర్భిణీతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యముగా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందుకోసం ప్రసవించే వరకు ఆర్థికంగా సహాయం చేయనుంది ప్రభుత్వం. గర్భవతి అయిన నాటి నుంచి మొదలు కొని ప్రసవించే వరకు ఒకే సారి రూ : 5 వేలు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యముగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం.

ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పథకానికి సంబందించిన దరఖాస్తులు లభ్యమవుతాయి. మరిన్ని వివరాల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో సంప్రదిస్తే పథకం వివరాలు పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *