Home » BJP : బీజేపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

BJP : బీజేపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

BJP : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 76 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమానికి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కాషాయం శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్బంగా రజనీష్ జైన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిచారు.

ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, ముదాం మల్లేష్, తోట మల్లికార్జున్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కొండవీటి తిరుమల, బెల్లంకొండ మురళి, నాగుల రాజన్న, బండి మల్లికార్జున్, బోయిని దేవేందర్, రెడ్డిమళ్ల అశోక్, ఆవిడపు రాజబాబు, బింగి సత్యనారాయణ, దేవరకొండ వెంకన్న, తూటి సరస్వతి, తరుణ్, చిట్యాల వెంకటేష్, రాజబాబు తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *