Home » Ekadashi : వైకుంఠ ఏకాదశిన ఈ వస్తువులను దానం చేయండి

Ekadashi : వైకుంఠ ఏకాదశిన ఈ వస్తువులను దానం చేయండి

Ekadashi : వైకుంఠ ఏకాదశి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి పదో తేదీన ఏకాదశి పురస్కరించుకొని అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ కమిటీలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వైష్ణవ దేవాలయాల్లో విష్ణు మూర్తిని దర్శించుకోవడంతో పాటు ఎలాంటి వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం……

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆ రోజు పేదలకు అన్నదానం చేయడం ఉత్తమం. అదేవిదంగా పేదలకు దుస్తులు, పండ్లు దానం చేయడం వలన పుణ్యం దక్కుతుందని వేదంలో చెప్పబడింది. ఇంటిలో మొలకెత్తిన తులసి మొక్కను తెలిసిన వారికి ఇవ్వండి. నవ ధాన్యాలు దానము చేస్తే విష్ణు మూర్తి అనుగ్రహం లభిస్తుంది. గోవును ఏదయినా దేవాలయానికి దానం ఇవ్వడం పుణ్యం.

వైకుంఠ ఏకాదశి రోజు కుటుంబ సభ్యుల పుట్టిన రోజు, పెళ్లి రోజు ఉంటె ఆ రోజు పేద విద్యార్థులకు అన్నదానం, దుప్పట్లు, నోటు పుస్తకాలు, స్టేషనరి దానం చేసినచో విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని వేదంలో చెప్పబడింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *