YS Jagan : చేతకాని నాయకుడు, పిరికి, అజ్ఞాని, మోసకారి, నమ్మకంలేని నాయకుడు అంటూ ఇలా అన్ని పదాలను వాడుతూ వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడుతున్నారు. ప్రజలను వివిధ పద్ధతుల్లో మోసం చేశారు అంటూ తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు చట్ట సభల్లో ఉండాలి.
కానీ ఇలా నాలుగు గోడల మధ్య ఉండి మీడియాతో ముచ్చట పెట్టడానికి కాదు అంటూ అసహణం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఒకవైపు నీ ఐదేళ్ల పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తుంటే, నీవేమో ప్యాలెస్ లో పత్రికా సమావేశాలు పెట్టడానికి బుద్ధి ఉండాలని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లానని చెప్పే నాయకుడికి ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే పదవికి కూడా పనికిరాడు. వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలకు సక్రమంగా వెళ్లని విద్యార్థికి ప్రధానోపాధ్యాయుడు సర్టిఫికెట్ ఇచ్చి ఇంటికి వెళ్లగొడుతాడు. విధులు సక్రమంగా నిర్వహించని ఉద్యోగస్తున్ని ఉద్యోగంలోంచి తొలగిస్తారు. ఎమ్మెల్యేగా చట్టసభకు వెళ్లని వ్యక్తి ఎక్కడ ఉన్నా ఒకటే. అమెరికాలో ఉంటే ఏమిటి, లండన్ లో ఉంటే ఏమిటి. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా ఒకటే. చట్టసభల్లో, ప్రజల్లో ఉందని వ్యక్తితో మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.
అసెంబ్లీకి వెళ్లని నాయకుడు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారు. ఆమె చేసిన డిమాండ్లు, లేవనెత్తిన ప్రశ్నలు, విసిరిన సవాళ్లు ఇప్పడు ఏపీ ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అంతే కాదు వైఎస్సార్ సీపీ నాయకులకు కూడా ఎలా స్పందించాలో అంతు పట్టడం లేదు. తమ నాయకున్ని నిలదీస్తుంటే ఎలా జవాబు చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు జగన్ పార్టీ నాయకులు.