India Cricket : 2007 లో వెస్టిండీస్ వేదికగా నిర్వహించిన ప్రపంచ కప్ పోటీలో ఇండియా జట్టు ఘోరంగా ఓటమి పాలైనది. అప్పుడు టీం ఇండియా జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గ వ్యవహరిస్తున్నారు. రాహుల్ తో పాటు సచిన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. యోధాను యోధులు ఉన్నప్పటికీ గ్రూప్ దశలోనే టీం ఇండియా జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఓటమితో కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మనస్తాపానికి గురైన రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు.
2021 లో టీం ఇండియా జట్టుకు కోచ్ గ బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా నియామకం అయిన తరువాత ఇండియా జట్టు నెంబర్ వన్ స్థానం సాధించింది. అయినప్పటికీ టీం ఇండియా జట్టు నెంబర్ టు స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాహుల్ ద్రావిడ్ ఎక్కడ అయితే పరాజయాన్ని మూటగట్టుకున్నాడో అక్కడే టీం ఇండియా జట్టు తాజాగా టీ 20 వరల్డ్ కప్ సాధించుకొంది రాహుల్ ద్రావిడ్ సారధ్యంలో. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ పదవీ కలం ముగిసింది. బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు.
భారత జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ కప్ సాధించిన సంబరాల్లో ఉన్న విరాట్ కోహ్లీ కి తన మనసులో ఉన్న మాట చెప్పాడు రాహుల్ ద్రావిడ్. ఇంతకు కోహ్లీకి చెప్పిన మాటలు ఏమిటా అని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించు కుంటున్నారు. కోహ్లీ తన క్రికెట్ చరిత్రలో అండర్ 19, వన్ డే, టీ 20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ సాధించిన రికార్డులు ఉన్నాయి. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సాధించలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సాధించాలని కోహ్లీకి రాహుల్ ద్రావిడ్ చెప్పి ఇప్పటి నుంచే లక్ష్యముగా పనిచేయాలన్నాడు.