Home » Chattishghar : ఛత్తీస్ ఘర్ లో భారీ ఎన్కౌంటర్

Chattishghar : ఛత్తీస్ ఘర్ లో భారీ ఎన్కౌంటర్

Chattishghar : ఛత్తీస్ ఘర్ రాష్ట్రము లోని నారాయణ పూర్ , బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీస్ బలగాలు గుర్తించాయి. సంఘటన స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం సుమారు పదకొండు గంటలకు ప్రారంభమైన కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయి. మృతులను గుర్తించాల్సి ఉందని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు.

పక్కా సమాచారంతో కూంబింగ్ ….

ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన కొందరు మావోయిస్టు సభ్యులు నారాయణపూర్, బస్టర్ , దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బలగాలు ఆ జిల్లాల అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. గురువారం ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దింతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరుగగా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. దాదాపుగా ఐదు గంటలకు పైగా కాల్పులు కొనసాగాయి. చీకటి పడటంతో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించడం విలుకాలేదని ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *