Message : వాట్సాప్ లో ఒకేసారి అనుకున్నన్ని మెస్సేజ్ లు పంపడం సాధ్యం కాదు. మనకు అవసరం ఉన్నన్ని మెస్సేజ్ లు పంపాలంటే వాట్సాప్ సపోర్ట్ చేయదు. దింతో సమయం వృధా అవుతుంది. ఒక్కొక్కరి చాట్ ను ఓపెన్ చేసి ఒక్కొక్కరికి మెస్సేజ్ పంపాలి. దింతో సమయం కొన్ని సందర్భాల్లో సరిపోదు. మనం చేయాలనుకున్న పనులు కూడా చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటాం.
ఈ యాప్ లో మాత్రం ఉన్నటువంటి ఫీచర్ల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఫీచర్ తో ఒకేసారి 256 మందికి మెస్సేజ్ పంపడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఈ ఆప్షన్ ఉపయోగించి ఒకేసారి అందరికి పంపే వెసులుబాటు ఉంది.
దీని కోసం మీరు ఒక చిన్న ట్రిక్ తెలుసుకుంటే సరిపోతుంది. యూజర్ సౌలభ్యం కోసం వాట్సాప్ యాప్‌లో ప్రసార జాబితాల ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ గ్రూప్‌ను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి 256 మందిని ఎంపిక చేసుకొని మెసేజ్‌లు పంపేందుకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.