ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించనున్నారని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆదివారం తెలిపారు.ఈ పథకం కింద కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదించే సభ్యునికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకంలో భాగంగా మందమర్రి పట్టణంలోని అన్ని వార్డుల్లో...