CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 12:29 pm Posted By: coalbelt 24 News

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించనున్నారని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆదివారం తెలిపారు.ఈ పథకం కింద కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదించే సభ్యునికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకంలో భాగంగా మందమర్రి పట్టణంలోని అన్ని వార్డుల్లో అర్హులైన కుటుంబాల వివరాల సేకరణకు ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నమోదు కోసం అవసరమైన పత్రాలు……
1. సంపాదించే సభ్యుని ఆధార్ కార్డు (వ్యక్తిగత హాజరు తప్పనిసరి).
2. కుటుంబ రేషన్ కార్డు.
3. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు.
4. సంపాదించే సభ్యుని మొబైల్ నంబర్.
5. నామినీకి సంబంధించిన వివరాలు.

కావున మందమర్రి పట్టణంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నమోదు కేంద్రాలకు అవసరమైన పత్రాలతో హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భద్రత లభించనుందన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});