పూలే ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా లోని కాసిపేట గని ఆవరణలో సింగరేణి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే 136వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో నెలకొన్న కులవివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక...