CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 8:47 pm Posted By: coalbelt 24 News

పూలే ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా లోని కాసిపేట గని ఆవరణలో సింగరేణి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే 136వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో నెలకొన్న కులవివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

మహిళా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన సంఘ సంస్కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేని సమసమాజ నిర్మాణమే పూలేకు మనం అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యా ప్రాధాన్యతను పెంపొందించడంతో పాటు అణగారిన వర్గాల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బన్న లక్ష్మణ్ దాస్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ కనుకుల తిరుపతి, బీసీ అసోసియేషన్ ఇన్‌చార్జి పర్వతి సురేష్, పిట్ సెక్రటరీలు రాజేందర్, బైరి శంకర్, సోగాల కన్నయ్య, కృష్ణ, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ మీనుగు లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ఎరుకల లింగస్వామి, బడికెల రమేష్, చోల్లంగి శ్రీనివాస్, చౌడ లింగయ్య, దొమ్మటి రమేష్, కొట్టే వెంకటస్వామి, దాసరి అనిల్ మైఖేల్, సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});