కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
హైదరాబాద్: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి, వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.1,509 పెరిగి రూ.1,29,970కు చేరింది. ఆభరణాల తయారీలో అధికంగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,700గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర శుక్రవారం రూ.1,56,244గా ఉండగా, శనివారం రూ.1,602 పెరిగి రూ.1,57,846కు చేరింది. వరుసగా పెరుగుతున్న పసిడి, వెండి ధరలతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});