CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 8:54 pm Posted By: coalbelt 24 News

పూలే ఆశయాల సాధనే నిజమైన నివాళి

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని సామాజిక సమానత్వం, విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేశారని కొనియాడారు. కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలపై ఆనాడే పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి, తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.

పూలే ఆశయాలను నేటి తరానికి అందించడంతో పాటు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గంలో నడవడమే మహాత్మా జ్యోతిరావు పూలేకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి సలేందర్ కొమురయ్య యాదవ్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోగాని శంకర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కరుణాకర్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు రవి, సీనియర్ నాయకురాళ్లు అంజలి, సగర్ల వాసవి, రవళి తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});