బీబీపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండలానికి చారిత్రక ప్రాధాన్యతతో పాటు భౌగోళికంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీబీపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని ముదిరాజ్ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా కొరివి నర్సింలు మాట్లాడుతూ.. నిజాం పాలన కాలం నుంచే బీబీపేటకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. అప్పట్లో గ్రామంలో పోలీస్ స్టేషన్ ఉండేదని, తంబలపాకుల తోట, గుల్సకట్టు గొలుసుకట్టు చెరువు వంటి చారిత్రక గుర్తింపులు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో చెరువులో...