విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సింగరేణి బాసట

తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి రూ.61.44 కోట్ల ఆర్థిక సహకారం 9 ప్రాంతాల్లో అత్యాధునిక కేంద్రీకృత వంటశాలల ఏర్పాటు 8 వేల పాఠశాలల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు నిత్యం పౌష్టిక అల్పాహారం గ్రామీణ విద్యాభివృద్ధికి సింగరేణి బృహత్తర సేవ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): విద్యార్థులు ఆకలి బాధను మరచి, ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా భారీ ఆర్థిక సహకారం అందిస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి...