భక్తిపారవశ్యంతో మార్మోగిన కాసిపేట-1 గని ఆవరణ
భక్తిశ్రద్ధలతో మైసమ్మ తల్లి 25వ వార్షికోత్సవ వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట-1 గని ఆవరణలో కొలువుదీరిన శ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదేలును ఆలయ కమిటీ...